ఇటీవల చైనాలో డింగ్ అనే రైతు తన ఇనుప పైపులను శుభ్రం చేస్తూండగా తన చేతికి మృదువుగా, వెంట్రుకవాసి స్పర్శ తగిలిందట, ఏంటా అని చూస్తే ఇవి కనిపించాయి. వీటి కొమ్మలు వెంట్రుకల కంటే సన్నగా ఉంటాయి. వీటి పేరు యూటవ్ పొలుఒ(Youtan Poluo) అని, ఇవి బుద్ధుని కాలంలో ఉండేవని, ఈ పూలు ప్రతి 3000 సం||లకు ఒకసారి వికసిస్తాయని స్థానికులు చెప్తున్నారు. ఇవి అదృష్ట సూచికలని వారు భావిస్తున్నారు.

ఇక మన శాస్త్రవేత్తల బృందం ఊరుకుంటుందా..! వెంటనే రంగంలోకి దిగి, వీటి పరిశీలించి, ఇవి లేస్వింగ్స్(Lacewings) అనే కీటక జాతికి చెందిన గుడ్లుగా చెప్తున్నారు. వీరు చెప్పే ఆ గుడ్ల చిత్రం ఈ క్రింద ఉన్నది..

కానీ డింగ్ మాత్రం ఈ పూలు తనకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టాయని చెప్తున్నాడు. ఏది నిజమో కాలమే నిర్ణయించాలి..
No comments:
Post a Comment