Your Ad Here

Type In English Convert to Telugu

Showing posts with label అక్షరం - పదం - వాక్యం. Show all posts
Showing posts with label అక్షరం - పదం - వాక్యం. Show all posts

అక్షరం - పదం - వాక్యం

Saturday

అక్షరం - పదం - వాక్యం

అ - అమ్మ - అమ్మ మాట వినాలి, అడుగు ముందుకు వేయాలి.

ఆ - ఆవు - ఆవు మనకి పాలు ఇచ్చును.

ఇ - ఇటుక - ఇటుక మీద ఇటుక పేర్చు, ఇల్లును అందంగా తీర్చు.

ఈ - ఈక - పాలపిట్ట అందం చూడు, ఈకలకున్న రంగులు చూడు.

ఉ - ఉడుత - ఉడుతా ఉడుతా ఉష్, ఎక్కడికెళ్తున్నావ్.

ఊ - ఊయలలో - ఊయలలో పసిపాప, అందరికీ కంటిపాప.

ఎ - ఎలుక - ఎక్కడి దొంగలు అక్కడనే పిల్లి వచ్చే ఎలుక భద్రం.

ఏ - ఏనుగు - ఏరు పారుతున్నది నిండుగా, ఏనుగు త్రాగును నీరు దండిగ.

ఐ - ఐదు - ఐదు వ్రేళ్లు బలిమి హస్తంబు పనిచేయు.

ఒ - ఒంటె - ఒంటె ఒకటి ఎడారిలో ఒంటరిగా వెళుతున్నది.

ఓ - ఓడ - ఓడలోని ప్రయాణం కలిగించును ఆనందం.

ఔ - ఔను - ఔను చిరునవ్వు ఒక ఔషధం.

అం - అంబరం - అంబరమంటే ఆకాశం, ఆకాశంలో హరివిల్లు.

క - కడవ - కడవ అడుగున నీరు కాకి పైకి తెచ్చెనెలా?

ఖ - ఖగం - ఖగం అంటే పక్షి.

గ - గంప - గంపలో పళ్లున్నవి, పళ్లలోన బలమున్నది.

ఘ - మేఘం - మేఘాల తెరలోన దాగుంది చందమామ.

చ - చక్రము - చక్రాలు సరిగా ఉంటే చక్కగా నడుస్తుంది బండి.

ఛ - ఛత్రం - ఛత్రం అంటే గొడుగు. ఎండ, వానలకు తొడుగు.

జ - జడ - జడలో పెట్టిన జాజిపూలు వెదజల్లునులే సువాసనలు.

ఝ - ఝషం - ఝషం అంటే చేప.

ట - టపాసు - టపాసు అంటే ఇష్టం, కాల్చాలంటే కష్టం.

ఠ - కంఠం - కంఠం ఎత్తి కోయిలమ్మ, ఎన్నో పాటలు పాడునమ్మ.

డ - డబ్బా- డబ్బాలో మిఠాయిలు నోరూరిస్తున్నాయా!

ఢ - ఢక్క - ఢక్క చేతిన పట్టి శివుడు నాట్యం చేయు.

ణ - వీణ - వీణ పలుకును రాగాలెన్నో, పాట లోపల భావాలెన్నో.

త - తల - తలను చక్కగా దువ్వాలి.

థ - రథం - రథము నడిపెను కృష్ణయ్య.

ద - దంతము - దంతాలను ప్రతి రోజూ తోమాలి.

ధ - ధనం - ధనం విలువ తెలుసుకో, పొదుపు కలిగి మసలుకో.

న - నక్క - నక్క ఎంతో టక్కరిది.

ప - పలక - పలకేమో నల్లన, అక్షరాలు తెల్లన.

ఫ - ఫలం - ఫలం అంటే పండు.

బ - బంతి - బంతి ఆట ఆడాలి.

భ - భజన - భగవంతుని పూజించు, భజన చేసి తరించు.

మ - మంచం - మంచానికి నాలుగు కాళ్లు.

య - యతి - యతి అంటే ఋషి.

ర - రవి - రవి అంటే సూర్యుడు.

ల - లత - లత అంటే తీగ.

వ - వంతెన - వంతెనపై వెళ్ళాలి, నదిని దాటి పోవాలి.

శ - శరం - శరం అంటే బాణం.

ష - వేషం - దసరాలో పులి వేషం, చూచేవారికి సంతోషం.

స - సంచి - సంచిలోన సర్దుకో పుస్తకాలు, బడికి వెళ్ళి నేర్చుకో పాఠాలు.

హ - హరిణం - హరిణం అంటే జింక.

ళ - తాళం - తాళం కాపాడుతుంది ఇంటిని.

క్ష - నక్షత్రం - నక్షత్రం తళ తళ మెరుస్తుంది.

ఱ - ఱంపం - ఱంపానికి పళ్లుంటాయి.

Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...