Your Ad Here

Type In English Convert to Telugu

తిరుమల


తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. “ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన ! వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !! ”

స్థల పురాణం శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యము ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధనం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు. చరిత్ర మరింత సమాచారం: తిరుమల చరిత్ర వ్యాసంలో 19 వ శతాబ్దాంతానికి... కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదే బోర్డు రూ.26 వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1980 లో తితిదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది. 15 వందల ఏళ్ల నుండి తిరుమల, పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయం లో మొట్టమొదటి కానుక గ దేవాలయం లో ని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్థంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు, ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది. 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున అలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు. 90 ఏళ్ళ పాటు మహంతుల నిర్వహణ తరువాత,1933లో అప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. ఘాట్‌రోడ్డు నిర్మాణం 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో 1974 లో రెండవ ఘాట్‌రోడ్డును(ప్రస్తుత ఎగువ రోడ్డు) కూడా నిర్మించారు. స్వామి వారి పూజలు రోజువారీ సేవలు శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాష లో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. సుప్రభాత సేవ*: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. తోమాలసేవ: ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత రెండవ సారి మరల తోమాలసేవ చేస్తారు. కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు ముఖతిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి 1008 నామాలనూ స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన ఇది. మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణం లో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట నైవేద్యం జరుగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు. రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మది దేవతలు స్వామి వారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచ పాత్రల లో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్ధాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్ధంగా ఇస్తారు. ఏడుకొండలస్వామి పవళింపుసేవ లో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే. ముత్యాల హారతి:ఉత్తర మాడా వీధి లో నివసించేతరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయం లో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబ ని పాట పాడి హారతి ని ఇమ్మని భక్తులూ,అర్చకులూ అడిగేవారట కాలక్రమం లో అది ఒక సేవగా స్థిరపడిపోయింది.ఈ సేవనే'తరిగొండ ముత్యాల హారతి'అనేవారు.వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది.అదే పరంపర నేటికీ కొనసాగుతుంది. గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు. ప్రత్యేక సేవలు రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు,నేత్ర దర్శనం,తిరుప్పావడ, సాయంత్రం పూలంగిసేవ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవం ఇవన్నీ ఉత్సవమూర్తులకు ప్రతి నిత్యం జరిగేవి. చేరుకునే విధం కాలి నడకన కాలిదారిలో కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, కడప జిల్లా నుండి ఉందని ప్రతీతి. అలిపిరి కాలిబాట: ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం ఇది తిరుపతి పట్టణం నుండి ఉండటం, తిరుమల తిరుపతి దేవస్థానముల (తితిదే) వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత, అక్కడి నుండి తితిదే వారు నడుపుతున్న ఉచిత బస్సు / ఆటో / ప్రయివేటు బస్సు / టాక్సీ / జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న "వేంకటేశ్వరుని పాదాల గుడి" దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. శ్రీవారి మెట్టు కాలిబాట: తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తితిదే వారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటతో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఇక్కడికి తిరుపతి నుండి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం ల మీదుగా ఒక బస్సు నడుపుతున్నారు. శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల గురించి కొన్ని విశేషాలు! (వీటిని దృవీకరించవలసి ఉన్నది. పరిశీలించగలరు) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా! శ్రీ వారి గర్భగుడి లో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములు గా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటల కు సుప్రభాత సేవ సమయం లో అర్చకుల చే తెరువబడుతాయి. ఆ సమయం లో బంగారు వాకిలి లోపలి కి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగి తో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయం లో అశ్చర్యకరం గా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలి లో ప్రవేశిస్తుంది. ఇది శ్రీ వారి లీల మాత్రమే గాని మరియొకటి కాదు. ఈ పిల్లి (లేక పిల్లులు)సుమారు గా 100 సంవత్సరముల(ఈ గుడి తో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు) నుండి శ్రీ వారి గర్భాలయం లో వున్నట్టు తెలుస్తోంది. మాములుగా రాత్రి శ్రీ వారి ఏకాంత సేవ సమయం లో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయం లో బ్రహ్మాది దేవతలు శ్రీ వారి ని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయం లో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు. ఇది అనుచానం గా శ్రీ వారి ఆలయం లో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధన ను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయం లో నే అర్చకుల తో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీ వారి కి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది.అలాగే రాత్రి ఏకాంత సేవ సమయం లో శ్రీ వారి కి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీ వారి కి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానం లో మరొక పిల్లి శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా శ్రీ వారు మనుష్యుల తో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారు! శ్రీవారి ఆభరణాలు తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి.[1]శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450)లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530)[1] స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 2-5-1513 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు.[1] తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది. స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పని చేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌మీరా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది.[1] స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి.[1] రోడ్డు మార్గం తిరుమల బస్టాండు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషన్. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టేషన్‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టేషన్ (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషన్ వెనకవైపు శ్రీ పద్మావతీ బస్‌స్టేషన్ ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి. రైలు మార్గం తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషన్ నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు. విమాన మార్గం తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి. చూడవలసిన ప్రదేశాలు తిరుమల మ్యాపు పాపవినాశనం

తిరుమల ముఖ్యాలయం: వెండి వాకిలి లొ దర్శించవలసిన విశేషాలు: (వామ భాగం నుండి దక్షిణ భాగం వైపు) గర్భగుడి/ఆనందనిలయం రాములవారి మేడ వరదరాజస్వామి ఆలయం పోటు ప్రధాన వంటశాల(అన్నప్రసాదాలు తయారుచేయు స్థలం) వకుళామాత దేవాలయం పూల బావి తీర్థం శఠరి ఇచ్చే ప్రదేశం హనుమ,అంగద,జాంబవదాదులు ఉత్సవ మూర్తులు ఉండే ఆలయం ఇప్పటి పరకామణి విమాన వెంకటేశ్వరస్వామి హుండీ యోగ నరసింహస్వామి ఆలయం అన్నమయ్య భాండాగారము: అన్నమయ్య భాంఢాగారం లో రాగి మీద చెక్కిన అన్నమయ్య పాటలను దాచి ఉంచారు. భాష్యకార్ల సన్నిధి బొక్కసం సెల్ వెండివాకిలి బయట ఉండే విశేషాలు తిరుమల రాయల మండపము రంగనాయకుల మండపము కళ్యాణ మండపము అయన మహల్(అద్దాల మండపము) పడిపోటు/ దిట్టం(శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్లు,వడలు,జిలేబి,మున్నగు పణ్యారాలను తయారుచేయు స్థలం) తులాభారం ఇతర ఆలయాలు, ప్రదేశాలు వరాహ స్వామి దేవాలయం బేడి ఆంజనేయస్వామి దేవాలయము కల్యాణకట్ట: భక్తులు మొక్కుగా తలనీలాలు సమర్పిన్ఛు స్థలము. తిరుమల ఆస్థాన మండపం శ్రీవారి ఆన్నదాన నిలయం శ్రీవారి పాదాలు శిలాతోరణం తిరుమల కొండలమీద ఉన్న వివిధ తీర్థాలు: తుంబురు తీర్థము రామకృష్ణ తీర్థము పాండవ తీర్థం దేవతీర్థం కుమారధారాతీర్థం కాయరసాయన తీర్థము జాబాలి తీర్థము శేష తీర్థము పసుపుధారా కుమారధారా తీర్థము చక్రతీర్థం శంకుతీర్ధం పంచాయుధతీర్థం బ్రహ్మతీర్థం అగ్నికుండతీర్థం సప్తర్షితీర్థం విష్వక్సేన సరస్సు పాప వినాశనము ఆకాశ గంగ గోగర్భం డ్యాము/గోగర్భతీర్ధం స్వామి పుష్కరణి వైకుంఠ తీర్ధం కపిలతీర్థం ఇంకా దర్శించవలసిన ప్రదేశాలు మ్యూజియం శిలాతోరణం ధ్యాన మందిరం ఆళ్వారులు అన్నమాచార్యులు వ్యాసరాయలు తరిగొండ వెంగమాంబ తిరుమల నంబి గొల్ల భక్తురాలు సర్ థామస్ మన్రో కులశేఖర ఆళ్వార్ హథీరాం బావాజీ వీరనరసింహ దేవుడు(గజపతి) చిత్రమాలిక శ్రీనివాసుని,అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు(మలయప్ప స్వామి)


శ్రీవారి ఆభరణాలు
తిరుమల గర్భగుడి ఆనందనిలయంపైన ఉన్న బంగారు గోపురం]] శ్రీవెంకటేశ్వరా మ్యూజియం 
తిరుమల ఆలయం రాత్రి దృశ్యం
పుష్కరిణి కోనేరు తిరుమల గోపురం, ఆనంద నిలయం శిలాతోరణం
















అన్నవరం







అన్నవరం ప్రధాన దేవాలయ దృశ్యం.

అన్నవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్టం లోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. గ్రామం లోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గం లో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా లో శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు.
అన్నవరం లో రత్నగిరి పర్వత శ్రేణి.
వూరి పొలిమేరల్లో వూర్పిడికి సిద్ధంగా ఉన్న వరి కొప్పులు. వెనుక కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని చూడవచ్చును.

అన్నవరం - పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడ వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత; చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.
స్థలపురాణం

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు.

అన్నవరం దేవాలయం

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు(సం. కృష్ణకుటజము, bot. Nerium Antidysentericum) కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ఆలయాన్ని సా. . 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.


అనుబంధంగా ఉన్న ఆలయాలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయము.

రత్నగిరి కొండల పై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరం లో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి కూడా రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం లో ఉన్నాయి. కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉన్నది.

విశేషాలు

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు రాజా .వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు(సం. కృష్ణకుటజము, bot. Nerium Antidysentericum) కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ఆలయాన్ని సా. . 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.ప్రధాన ఆలయం రథాకారం లో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాల తో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణం లో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.

ఆలయం ప్రకారం రెండు అంతస్థులలో నిర్మింపబడింది.క్రింది భాగం లో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగం లో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులు గా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తు లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది.

సత్యనారాయణస్వామి సత్యనారాయణ స్వామి శ్రీ సత్యనారాయణ స్వామివారిని

" మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్చ మహేశ్వరం అధతో విష్ణురూపాయ త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.

రత్నగిరి సానువులు మర్యు స్వామివారి పుష్కరిణి
భక్తుల విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసిన ఉధ్యానవనం.

రత్నగిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణ మే.

* శ్రావణ శుద్ధ విదియ - శ్రీసత్యనారాయణస్వామి జయంతి.
* వైశాఖ శుద్ద దశమి-వైశాఖ బహుళ పాఢ్యమి( ఐదు రోజులు) శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి.
* వైశాఖ శుద్ధ ఏకాదశి- స్వామివారి కళ్యాణం
* చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది - పంచాగశ్రవణం
* శ్రీరామనవమి - చైత్ర శుద్ధ నవమి - శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు
* చైత్ర బహుళ షష్ఠి - కనక దుర్గమ్మ జాతర
* సరస్వతీ పూజ
* శ్రీకృష్ణాష్టమి- శ్రీ కృష్ణ జయంతి
* వినాయక చవితి - గణపతి నవరాత్రులు
* దేవీ నవరాత్రులు - యంత్రాలయం లో లక్ష కుంకుమార్చన
* విజయదశమి
* దీపావళి
* కార్తీక పౌర్ణమి - గిరి ప్రదక్షిణ - జ్వాలాతోరణం
* కార్తీక శుద్ధ ద్వాదశి - తెప్పోత్సవం
* మహాశివరాత్రి - లక్ష బిల్వార్చన

* స్వామి దర్శన వేళలు ఉదయం 6 గం నుండి రాత్రి 8 గం వరకు.
* అన్ని వర్గాల వారికి వసతి భోజన సదుపాయాలు ఉన్నాయి.
దర్శనీయ స్థలాలు కాలనిర్ణయ యంత్రం.sundail రైల్వే స్టేషన్

పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ, నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసి, పని చేసేగడియారం ఇది.

* తులసివనం
* వనం మధ్యలో పాముపుట్ట
* ఉద్యానవనం. ఇక్కడ భక్తులు సేదతీరేందుకై ఏర్పాటు చేయబడిన ఉద్యానవనంలో అందమైన పూలమొక్కలు,పొగడచెట్లు,పూజలకు ఉపయోగపడే పలు పత్రిమొక్కలు పెంచబడుతున్నవి.ఉధ్యానవనం మద్య మద్య కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లలు కట్టబడ్డాయి.

ఒక విశేషం

రత్న గిరి పై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రాముఖ్యతకు గుర్తుగాను, స్వామి వారిని దర్సించేందుకు వచ్చే భక్తజనానికి ప్రయాణ సౌకర్యాన్ని కలిగించే దృష్టి తోను రైల్వే శాఖ రత్నాచల్ పేరు తో ఒక ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఇది విశాఖపట్నం-విజయవాడ మధ్య నడుస్తూ, అన్నవరం స్టేషను లో ఆగుతుంది.

బయటి లింకులు

* అన్నవరం దేవస్థానం వారి వెబ్సైటు * టెంపుల్ నెట్లో

Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...