Your Ad Here

Type In English Convert to Telugu

Showing posts with label టెక్నాలజీ. Show all posts
Showing posts with label టెక్నాలజీ. Show all posts

సి.డి, డి.వి.డి ల లో వికీపిడియా

Wednesday

విశ్వ విజ్ఞాన సముదాయం వీకీ. మరి అలాంటి వీకీ ఇప్పుడు సీ.డీ, డి.వి.డీలపై దొరుకుతుంది! అదీ ఉచితంగా...కొన్ని స్వచ్ఛంద సంస్థల పుణ్యమా అని వీకీ సీ.డీ, డి.వి.డీలపై మనముందుకు వచ్చింది. ఈ దెబ్బతో మైక్రోసాఫ్ట్ ఎన్కార్టా(Microsoft Encarta), బ్రిటానికా ఎన్సైక్లోపీడియా(Britannica Encyclopedia) వంటి వాటికి చుక్కెదురైనట్లే. వారి వ్యాపారాలు దెబ్బతింటూండడం వల్ల ఇప్పటికే వారు వీకీపై దూషణలు(అదేనండి వీకీలో వ్యాసాలు తప్పులు తడకలంటూ...) మొదలు పెట్టారు.


వీకీను సీ.డీలపై ఆవిష్కరించడానికి వీకీమీడియా(Wikimedia) మరియు ఫ్రాన్సుకు చెందిన లింటర్ వెబ్(Linter Web) కలిసి కివిక్స్(Kiwix) అనే ఓపెన్ సోర్సు ప్రాజెక్టును మొదలుపెట్టాయి. దీనిని ఎవ్వరైనా ఉచితంగా దిగుమతి(Download) చేసుకోవచ్చు. ఇందులో వివిధ అంశాలకు చెందిన 2000 ఆంగ్ల వ్యాసాల వారకూ పొందుపరచి ఉంచారు. దీనీ పరిమాణం సుమారుగా 425M.B దాకా ఉంటుంది. ఇక ఇటివల SOS Childrens villages అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఇదే తరహాలో సీ.డీ, డి.వి.డీలపై వీకీని విడుదల చేసింది. వీరు ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా రెండింటిని విడుదల చేశారు. చిన్నది సీ.డీలను ఉద్దేశించి తయారు చేయబడింది. దీని పరిమాణం సుమారుగా 800M.B వరకూ ఉంటుంది. దీనిని నేరుగా వారి సైట్ నుంచి దిగుమతి చేసుకోవచ్చు . ఇకపోతే పెద్దదాంట్లో మరిన్ని వ్యాసాలు, మరింత వివరణాత్మకంగా ఉంటాయి. ఇది సుమారుగా 2.5G.B వరకూ ఉంటుంది. కాకపోతే దీనిని దిగుమతి చేసుకోవడానికి బిట్ టొరెంట్(Bit Torrent), అజూరస్(Azureus) లాంటి ఏదైనా టోరెంట్ క్లయింట్ కలిగి ఉండాలి. మరింకెందుకు ఆలస్యం పని మొదలు పెడితే పోలా...

విండోస్ లో "☺ ☻ ♥ ♦ ♣ ♠ • ◘ ○" ఇలాంటివి సులభంగా రాయవచ్చు.

↓ ♠ ♫ ☼ ► ◄ ♂ ♀ ♪ ఇలాంటి రకరకాల గుర్తులను విండోస్ లో సులభంగా రాయవచ్చు. అందుకు పెద్దగా కష్టపాడాల్సింది కూడా ఏమీ లేదు. ముందుగా ఏ Notepadనో, Wordpadనో, మరే ఇతర రాసుకునేందుకు ఉపయోగపడే సాధనాన్ని తెరవండి. ఇప్పుడు Alt ను నొక్కి ఉంచి 1 నొక్కండి. మీకు "☺" అనే సంజ్ఞ కనిపిస్తుంది. ఇదే విధంగా ఒకటి బదులుగా రెండు నొక్కితే "☻" అని కనిపిస్తుంది. ఇలా ఒకటి నుంచి 256 వరకు ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క రకమైన సంజ్ఞ వస్తుంది. ఇందులోనే మనం నిత్యం ఉపయోగించే ఆంగ్ల అక్షరాలు, అంకెలు, మరియు *&% మొదలైనటువంటి సంజ్ఞలు కూడా ఇమిడి ఉంటాయి. ఈ 256తో పాటుగా మరికొన్నింటిని కూడా రాయవచ్చు. ఉదాహరణకు Alt ను నొక్కి ఉంచి 0153 అని నొక్కండి. ™ అని కనిపిస్తుంది. కాకపోతే ఈ విధంగా 0ను ముందు కలిపితే మొత్తం 256 కూ రకరకాల సంజ్ఞలు రావు, కేవలం కొన్నింటికి మాత్రమే వస్తాయి. ఏ అంకెకు ఏ సంజ్ఞ వస్తుందో తెలుసుకునేందుకు పట్టికను చూడండి.

దీని గురించిన మరింత సమాచారమునకై ఈ క్రింది లంకెలను చూడండి:
http://en.wikipedia.org/wiki/Windows_Alt_keycodes

http://www.usefulshortcuts.com/alt-codes/index.php

గూగుల్ కహాని

ఇంటెర్నెట్ గురించి తెలిసినవారందరికీ గూగుల్ సుపరిచితమే. మీలో చాలామంది గూగుల్ అభిమానులు ఉండి ఉంటారు. నేను కూడా గూగుల్‌ను అభిమానినించేవాడినే... కాని ఇటీవల మార్కెట్‌లో వస్తున్న మార్పులుకు గూగుల్ పోటీ పోటీపడలేక పోతుందేమోనని అనిపిస్తుంది. సర్చ్ ఇంజెన్‌గా అడుగుపెట్టిన గూగుల్, వెబ్‌లో ఒక విప్లవాన్ని సృష్టించింది. దాని ఆదర్శంగా తీసుకుని ఎన్నో కంపెనీలు వృద్దిలోకి వచ్చాయి. నిదానంగా ఒక్కొక్క సర్వీసు పెంచుకుంటూ ఇప్పుడు వెబ్ లోని అన్ని ప్రధాన సంస్థలకు ప్రధాన పోటీదారుగా నిలబడింది. అన్ని సేవలూ ఉచితంగానే అందజేస్తూ వచ్చింది. గూగుల్ సేవల్లో ప్రధానంగా చెప్పుకోవలిసిన విషయమేమిటంటే, వీరి సేవల్లో ప్రకటనలు ఉండవు. అన్ని సేవలూ ఆకర్షనీయంగా, అర్థమయ్యేలా, ప్రొఫెషనల్‌గా ఉంటాయి. ఆఖరికి ప్రకటనల విషయంలో కూడా గూగుల్ యాడ్‌సెన్స్ ద్వార తన సత్త యెమిటో మరో సారి చూపింది.
Google

కాని ఇక్కడినుంచే, కథ మారిపోయింది. నిదానంగా తన సేవలన్నింటిలోనూ ప్రకటనలను జతచేయదం మొదలుపెట్టింది. పోటీ ప్రపంచంలో వస్థున్న మార్పులను తట్టుకునేందుకు, తనకు అడ్డు వచ్చిన చిన్న కంపెనీలన్నింటినీ(writely, youtube...) కొనుక్కోవడం మొదలుపెట్టింది (కానీ కొన్ని కుదరలేదనుకోండి ఉదా:facebook). ఇటీవల అది doubleclick కొన్నదని చూసాను. ఏమైనప్పటికీ ఒకప్పుడు ఉన్నన్ని ప్రమాణాలు ఇప్పటి గూగుల్ లో కనిపించడంలేదనిపిస్తుంది. ఈ మారిన పరిణామాల వల్ల గూగుల్ కూడా అగ్ర కంపెనీలు(అందరినీ విసిగించే కంపెనీలు) అయిన microsoft, yahoo...ల దారిలో వెల్తుందో లేక తన శైలో నడుస్తూ మునపటిలా విరాజిల్లుతుందో వేచిచూడాల్సిందే..

13 గిగా పిక్సెల్స్ ఫోటో..

మనం ఇప్పటి వరకు, మెగా పిక్సెల్ ఫోటోలను మాత్రమే చూస్తున్నాం. అది కూడా మాహా అయితే ఒక 10 నుండి 15 మెగా పిక్సెల్స్ ఉంటుంది. ఐతే ఎప్పుడైనా గిగా పిక్సెల్ ఫోటోలను చూసారా?? అయితే ఒక సారి దీన్ని చూడండి.. ఈ సైట్‌లో కనిపించే ఫోటొ రెసొల్యూషన్ 13 గిగా పిక్సెల్లు. దీనిని కనుకా దాని అసలు రెసొల్యూషన్‌తోొ ప్రింట్ చేస్తే అది సుమారుగా పన్నెండువేల చదరపు మీటర్ల వైశాల్యం మీరకు ఉంటుంది. అంటే దీనిని పరిచి పెడితే సౌమారుగా 1.2 ఎకరాల స్థలం అవసరమవుతుంది. అయితే ఈ భారీ ఫోటోని కెమేరాతో ఒకే క్లిక్‌తో తీసారనుకుంటే పొరపాటే. దీన్ని కొన్ని వందల ఫోటోలను అనుసంధానం ద్వారా రూపొందించారు. ఇప్పటి వరకూ గిగా పిక్సెల్ సామర్థ్యంతో కెమేరాలు అందుబాటులో లేవు. ఇప్పుడిప్పుడే ఒక 4 గిగా పిక్సెల్ కెమేరా తయారు చేయడం కోసం రంగం సిద్దమవుతోంది. ఎంతో అద్భుతమైన ఈ కళాఖండాన్ని ఒకసారి మీరూ దర్శించండి. మరిన్ని గిగా పిక్సెల్ చిత్రాల కోసం ఈ సైట్లను వీక్షించండి.
http://haltadefinizione.deagostini.it/
http://www.gerardmaynard.org/
http://www.tawbaware.com/maxlyons/gigapixel.htm


"అంతా డిజిటల్ లోకం మాయ..."

విండోస్ లో దాగున్న ప్రోగ్రాము

విండోస్ లో దాగున్న ఒక కమాండ్ లైన్ ప్రోగ్రాము గురించి తెలిసింది. దీని ద్వారా మనమే మనకు కావలసిన రీతిలో ఒక .exe ఫైల్ ని చా సులభంగా తయారు చేసుకోవచ్చు.దీని పేరు "IExpress".

ముందుగా విండోస్ లోని రన్(Run) ప్రోగ్రాం తెరవండి. అందులో "iexpress" (అటూ, ఇటూ ఉన్న కోట్స్ కలపకుండా)అని టైపు చేయండి. ఆ తరువాత "IExpress Wizard" అనేది తెరుచుకుంటుంది. అందులో ఇచ్చిన ఆదేశాలను పాఠిస్తూ, మీరు నడపదలచిన ప్రోగ్రాములను వివరాలను అందులో ఇవ్వండి. ఆ తరువాత దానిని విండోస్ .exe ఫైల్ గా భద్రపరుస్తుంది. ఇప్పుడు ఆ .exe ఫైల్ ను నడిపిస్తే(Runచేస్తే) మీరు తయారు చేసిన ప్రోగ్రాములను, మీరిచ్చిన ఆదేశాల మేరకు నడుస్తాయి. ఇలా దీని ద్వారా ఒకదాని తరువాత మరొక ప్రోగ్రాములను మన ప్రమేయము లేకుండా నడపవచ్చు. అంతే కాదు దీని వల్ల ఒకటి కంటే ఎక్కువ మృదులాంత్రములను(softwares) జతచేర్చి, ఒకే మృదులాంత్రముగా(software) వాడుకోవచ్చు.

ఈ మాయదారి మైక్రోసాఫ్ట్ విండోస్ లో మరెన్ని మాయాజాలాలు దాగున్నాయో? మీకేమైనా తెలిస్తే క్రింద వ్యాఖ్యానించండి.

గూగుల్ సెల్ ఫోన్

గూగుల్", కంప్యూటర్ గురించి ఏ కొద్ది విజ్ఞానం ఉన్నవారికైనా ఈ పదం సుపరిచితం. దీన్ని ఉపయోగించకుండా అంతర్జాల విహారం అస్సలు సాధ్యపడదేమో? నెజ్జెనులపైన అంతగా చెరగని ముద్ర వేసింది ఈ శోధనా యంత్రం. గూగుల్ కేవలం శోధనకే పరిమితం కాలేదు. వివిధ రకాల వెబ్ సేవలను వినియోగదారుల ముంగిట నిలిపింది. కొన్ని భారీ సత్ఫలితాలను అందిస్తే, మరి కొన్ని కనుమరుగై పోయాయి. మరి అలాంటి గూగుల్ వాస్తవ ప్రపంచంలో వినియోగదారులకు మరింత దగ్గరౌతూ, మొబైల్ ఫోన్లను అందించడానికి శ్రీకారం చుట్టబోతుంది.




వాస్తవానికి గూగుల్ నుంచి దీని గురించి, ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కాని కొన్ని ప్రముఖ సమాచార సంస్థలు, మొబైల్ ప్రపంచంలోకి గూగుల్ ఆగమన ప్రయత్నాలను బయట పెట్టాయి. వాస్తవానికి ఆపిల్ ఐ-ఫోన్ విడుదలైన నాటి నుంచీ వెబ్ లో జి-ఫోన్ ఆగమనం గురించి రకరకాల వదంతులు వచ్చాయి. ఒక దశలోనైతే గూగుల్ ఏకంగా జి-ఫోన్ ను ఉచితంగా అందిచడానికి సిద్ధమైనట్లు వదంతులు వ్యాపించాయి. ఇదంతా ఎలా సాధ్యమంటే గూగుల్ కొన్ని ప్రముఖ సంస్థలతో తమ జి-ఫోన్లపై వారి ప్రకటనలు వచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుందని చెప్ప సాగారు. కాని ఇవన్నీ నిరాధారితమనవి. శనివారం(03/11/2007) నాడు ప్రముఖ "వాల్ స్ట్రీట్ జర్నల్",BBC గూగుల్ దీని పై సోమవారం(05/11/2007) నాడు ఒక ప్రకటన చేయనుందని తెలిపాయయి. దీనికి ఆధారాలుగా గూగుల్, గ-ఫోన్ యొక్క పేటెంట్ హక్కులను పొందడం,అది ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని ప్రముఖ మొబైల్ సంస్థల జాబితాను చూపించాయి.
జి-ఫోన్, లినక్స్ ను ఉపయోగిస్తూ తమ మొబైల్ ను రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే "Open-Moko" ప్రాజెక్టు ద్వారా ఒక ఓపెన్ సోర్సు మొబైల్ ఫోను సిద్ధమై ఉన్నది. బహుశా వీరు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. జి-ఫోన్ కూడా ఇటీవల ప్రజల ఆదరణ చూరగొన్న ఐ-ఫోన్ లో ఉన్న అన్ని హంగులతో మన ముందుకు రావచ్చు. ఎంత తొనదరగా ప్రకటన చేసినప్పటికీ ఇది మార్కెట్ లో అడుగెడటానికి మరో సం|| కాలం పట్టవచ్చుననేది అంచనా. జి-ఫోన్ ఆగమనంతో మొబైల్ రంగంలో సరికొత్త విప్లవం ప్రారంభం కావచ్చు. మొబైల్ రంగంలోనూ ఓపెన్ సోర్స్ విప్లవానికి నాంది పలకొచ్చు.


జి-ఫోన్ యొక్క ఊహా చిత్రం.







ఇక వదంతులు కట్టిపెట్ట వాస్తవానికి వద్దాం. ఇప్పుడే గూగుల్ జి-ఫోన్ పై ఒక ప్రకటన చేసింది.అయితే అందరి ఊహాగానాలను తలక్రిందలు చేస్తూఇది ప్రస్తుతానికి మొబైల్ రంగంలో సాఫ్ట వేర్ లో మాత్ర్మే అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. హార్డ్ వేర్ రంగంలోకి అడుగెడటానికి మరి కొత సమయం పట్ట వచ్చునని కూడా తెలిపింది. ఆండ్రాయిడ్ సంస్థ ద్వారా ఓపెన్ హ్యాండ్ సెట్ ను ప్రవేశపెడుతుంది. ఇక ఈ జి-ఫోన్ తాలూకా ఆపరేటింగ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తూ మొబైళ్ళను తీసుకు రావాలని ఒక 30కు పైగా అగ్రగామి కమ్పెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గ-ఫోన్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడానికి మరో సంవత్సరం పట్ట వచ్చునని కూడా తెలిపింది. ఇక ఈ జి-ఫోన్ మొబైల్ రంగంలో ఎన్ని మార్పులు చేర్పులను తెస్తుందో వేచి చూడాల్సిందే.






జి-ఫోన్ కు సంబందించిన కొన్ని లంకెలు:
వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన వార్త.

వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన మరొక వ్యాసం.

న్యూయార్క్ టైంస్ లో వచ్చిన వార్త.

న్యూయార్క్ టైంస్ లో వచ్చిన మరొక వ్యాసం.

వీకీలో జి-ఫోన్ పై వ్యాసం.

జి-ఫోన్ కల్పిత చిత్రాలు.

ఓపెన్ మోకో ప్రాజెక్టు సైటు.

గూగుల్ అధికారికంగా చేసిన ప్రకటన.

ఆండ్రాయిడ్ వెబ్ సైటు.

Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...