Type In English Convert to Telugu
గూగుల్ కహాని
Wednesdayఇంటెర్నెట్ గురించి తెలిసినవారందరికీ గూగుల్ సుపరిచితమే. మీలో చాలామంది గూగుల్ అభిమానులు ఉండి ఉంటారు. నేను కూడా గూగుల్‌ను అభిమానినించేవాడినే... కాని ఇటీవల మార్కెట్‌లో వస్తున్న మార్పులుకు గూగుల్ పోటీ పోటీపడలేక పోతుందేమోనని అనిపిస్తుంది. సర్చ్ ఇంజెన్‌గా అడుగుపెట్టిన గూగుల్, వెబ్‌లో ఒక విప్లవాన్ని సృష్టించింది. దాని ఆదర్శంగా తీసుకుని ఎన్నో కంపెనీలు వృద్దిలోకి వచ్చాయి. నిదానంగా ఒక్కొక్క సర్వీసు పెంచుకుంటూ ఇప్పుడు వెబ్ లోని అన్ని ప్రధాన సంస్థలకు ప్రధాన పోటీదారుగా నిలబడింది. అన్ని సేవలూ ఉచితంగానే అందజేస్తూ వచ్చింది. గూగుల్ సేవల్లో ప్రధానంగా చెప్పుకోవలిసిన విషయమేమిటంటే, వీరి సేవల్లో ప్రకటనలు ఉండవు. అన్ని సేవలూ ఆకర్షనీయంగా, అర్థమయ్యేలా, ప్రొఫెషనల్‌గా ఉంటాయి. ఆఖరికి ప్రకటనల విషయంలో కూడా గూగుల్ యాడ్‌సెన్స్ ద్వార తన సత్త యెమిటో మరో సారి చూపింది.
కాని ఇక్కడినుంచే, కథ మారిపోయింది. నిదానంగా తన సేవలన్నింటిలోనూ ప్రకటనలను జతచేయదం మొదలుపెట్టింది. పోటీ ప్రపంచంలో వస్థున్న మార్పులను తట్టుకునేందుకు, తనకు అడ్డు వచ్చిన చిన్న కంపెనీలన్నింటినీ(writely, youtube...) కొనుక్కోవడం మొదలుపెట్టింది (కానీ కొన్ని కుదరలేదనుకోండి ఉదా:facebook). ఇటీవల అది doubleclick కొన్నదని చూసాను. ఏమైనప్పటికీ ఒకప్పుడు ఉన్నన్ని ప్రమాణాలు ఇప్పటి గూగుల్ లో కనిపించడంలేదనిపిస్తుంది. ఈ మారిన పరిణామాల వల్ల గూగుల్ కూడా అగ్ర కంపెనీలు(అందరినీ విసిగించే కంపెనీలు) అయిన microsoft, yahoo...ల దారిలో వెల్తుందో లేక తన శైలో నడుస్తూ మునపటిలా విరాజిల్లుతుందో వేచిచూడాల్సిందే..