Your Ad Here

Type In English Convert to Telugu

Showing posts with label వింతలు-విశేషాలు. Show all posts
Showing posts with label వింతలు-విశేషాలు. Show all posts

అరుదైన వింత వృక్షాలు

Wednesday


జీవిస్తున్న నిచ్చెన. 'The Ladder Tree'

ఈ చిత్రాలలో కనిపిస్తున్న అన్ని చెట్లకూ సృష్టి కర్త, ఆక్సెల్ ఎర్లాండ్సన్(Axel Erlandson
) అను పేరు గల ఓ అమెరికన్ రైతు. రైతంటే మామూలు రైతు కాదు, చెట్ల ఎదుగుదలను కట్టడి చేస్తూ వాటిని విభిన్న ఆకృతులలోకి మలచగల శిల్పి. ఇతను కాలిఫోర్నియాలో ఒక ఉద్యానవనాన్ని స్థాపించాడు. ఇక ఇతని పనంతా అందులో చెట్లను పెంచడమే, కాకపోతే ఒక్కొక్క చెట్టును ఒక్కొక్క ఆకృతిలోకి మలచాలి. ఇలా మలచడానికి ఇతను పర్నింగ్(purning), గ్రాఫ్టింగ్(grafting) పద్దతులను ఉపయోగించేవాడు.తరువాత తరువాత ఇది ఒక సందర్శనాలయంగా మారింది. తరువాత దీనికి "The Tree Circus" అనే పేరు కూడా వచ్చింది.


ఇది Basket Tree గా ప్రసిద్ధిపొందింది.

తరువాత 1963లో $12,000కు ల్యారీ,పెగ్గీ థాంసన్ లకు విక్రయించాడు. అటు తరువాత ఇది పలువురి చేతులు మారుతూ, రకరకాల పేర్లు మారుతూ వచ్చింది. ఆఖరుగా మైఖేల్ బోన్ఫాంటే వీటిని తన నర్సరీలోకి తరలించి దానికి బోన్ఫాంటే గార్డెన్స్ (Bonfonte Gardens)గా నామకరణం చేశాడు. ఇప్పుడు ఇవి గిల్రాయ్ గార్డెన్స్(Gilroy Gardens) గా పిలవబడుతున్నాయి ఈ మహా వృక్షాల మహా శిల్పి Axel Erlandson.

దీనిపై మరింత సమాచారం కొరకు ఈ క్రింది లంకెలను ఆశ్రయించండి.
http://en.wikipedia.org/wiki/Axel_Erlandson

http://www.arborsmith.com/treecircus.html

http://www.mv-voice.com/morgue/2001/2001_08_03.hg3.html

http://romantictraveling.com/BonfanteGardens.htm

3000 సం||లకు ఒక సారి వికసించే పుష్పాలు.

ఇటీవల చైనాలో డింగ్ అనే రైతు తన ఇనుప పైపులను శుభ్రం చేస్తూండగా తన చేతికి మృదువుగా, వెంట్రుకవాసి స్పర్శ తగిలిందట, ఏంటా అని చూస్తే ఇవి కనిపించాయి. వీటి కొమ్మలు వెంట్రుకల కంటే సన్నగా ఉంటాయి. వీటి పేరు యూటవ్ పొలుఒ(Youtan Poluo) అని, ఇవి బుద్ధుని కాలంలో ఉండేవని, ఈ పూలు ప్రతి 3000 సం||లకు ఒకసారి వికసిస్తాయని స్థానికులు చెప్తున్నారు. ఇవి అదృష్ట సూచికలని వారు భావిస్తున్నారు.

Youtan Poluo flower by environmental graffiti, a UK-based environmental blog


ఇక మన శాస్త్రవేత్తల బృందం ఊరుకుంటుందా..! వెంటనే రంగంలోకి దిగి, వీటి పరిశీలించి, ఇవి లేస్వింగ్స్(Lacewings) అనే కీటక జాతికి చెందిన గుడ్లుగా చెప్తున్నారు. వీరు చెప్పే ఆ గుడ్ల చిత్రం ఈ క్రింద ఉన్నది..



కానీ డింగ్ మాత్రం ఈ పూలు తనకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టాయని చెప్తున్నాడు. ఏది నిజమో కాలమే నిర్ణయించాలి..

9/11 తమాషా

9/11 గురించి ఎవరికి మాత్రం తెలియదు. 2001లో సెప్టెంబర్ 11న అమెరికాలో జంట భవనాలు మరియు పెంటగాన్ పై పేలుళ్ళు జరిగాయి. ఉగ్రవాదుల దుశ్చర్య అని కొందరు, లేదు బుష్ ప్రభుత్వమే దీనిని కావాలని చెయించిందని కొందరు(సత్యాన్వేషులు Truth Movement) వాదిస్తూ ఉంటారు. సరే కాసేపు ఆ వాదనలను పక్కన పెట్టి ఆ సంఘటనకు ఉన్న ప్రత్యీకతలేమిటో ఒక సారి చూద్దాము...

పేలుళ్ళు జరిగిన తేదీ 9/11 అంటే 9+1+1=11.
సెప్టెంబరు 11, సంవత్సరంలో 254వ దినం.. అంటే 2+5+4=11.
సెప్టెంబరు 11 తరువాత సంవత్సరంలో 111 రోజులు మిగిలాయి.
ఆ భవంతులను డీకొన్న మొదటి విమానపు సంఖ్య 11.
ఆ రెండు భవంతులు 11 సంఖ్య ఆకారాన్ని పోలి ఉంటాయి.
న్యూయార్క్ అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో 11వ రాష్ట్రంగా చేరింది.
New York City లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
The Pentagon లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
Afghanisthan లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
George W Bush లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
ఇక చివరగా కొసమెరుపేమిటంటే, అమెరికా అత్యవసర సేవలకు(Emergency Services) సంప్రదించాల్సిన సంఖ్య 911 (అయితే ఈ సేవలను 1968లో మొదటి సారిగా ప్రవేశ పెట్టారు).

మరో చిన్న మాట మీరు గమనించారో లేదో, ఈ 11 గురించి ఖచ్ఛితంగా 11 విశిష్టతలను వివరించాను.

హైటెక్ బస్సుల మీద నిప్పులనక్క(Firefox) చిత్రాలు

మన నిప్పులనక్క(Firefox) ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, ఏకంగా హైటెక్ బస్సులమేద దీని లోగోలను చిత్రిస్తున్నారు. ఇటీవల నేను మా ఊరు ఆత్మకూరు(మంగళగిరి మండలం) నుంచి విజయవాడకు వెళ్తుంటే, N.H-5 మీద ఆగి ఉన్న ఒక హైటెక్ బస్సు మీద మన నిప్పులనక్క(Firefox) లోగోను చిత్రించడం చూసి ఆశర్యపోయాను. సమయానికి చిత్రిద్దామనుకుంటే నా దగ్గర కెమేరా లేకపోయింది. తరువాత కొన్నళ్ల తరువాత వెబ్‌లో ఈ చిత్రాలను చూసాను. నిప్పులనక్క(Firefox) అందరి జీవితాలలో ఎంతగా భాగమైపోయిందో ఈ చిత్రాలు ఒక మచ్చుతునక మాత్రమే. ఇదిగో వెబ్‌లో నాకు దొరికిన ఈ చిత్రాలను చూడండి మీకే అర్థమవుతుంది. బహుశా ఇప్పటికే చాలా మంది వీటిని ప్రత్యక్షంగా వీక్షించి ఉండే ఉంటారు (ముఖ్యంగా బెంగుళూరు హైటెక్ వాసులు). నిప్పులనక్కా అధరహో..


http://smartphonearena.com/wp/images/ffb1.jpg


http://smartphonearena.com/wp/images/ffb2.jpg

గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు

ఇన్నళ్లూ గూగుల్ అర్థ్ ద్వారా కేవలం మ్యాపులను, మా ఊరిని, మా ఇంటిని, మా స్నేహితుల ఇళ్లని, ప్రపంచంలోని వివిధ దేశాలలోని ప్రాముఖ్యమైన ప్రదేశాలను గుర్తించడానికే ఉపయోగించేవాడిని. అయితే ఈరోజు ఈ రెండు వీడియోలు చూసాక మన భూమండలం మీద మనుకు తెలియకుండా దాగున్న వింతలను సైతం గ్రహించవచ్చని తెలిసింది.





ఇక ఈ రెండో వీడియోలోనైతే, ఏకంగా ప్రాచీన ఈజిప్ట్ పిరమిడ్లలో చెక్కిన దేవుళ్ళు, దేవతల ఆకారాలకు, మన భూమి ఆకారానికి సారూప్యాలను చూడవచ్చు. నిజంగా చాలా ఆషర్యపరిచేలా ఉన్నాయి.


Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...