Type In English Convert to Telugu
అరుదైన వింత వృక్షాలు
Wednesday
జీవిస్తున్న నిచ్చెన. 'The Ladder Tree'
ఈ చిత్రాలలో కనిపిస్తున్న అన్ని చెట్లకూ సృష్టి కర్త, ఆక్సెల్ ఎర్లాండ్సన్(Axel Erlandson
) అను పేరు గల ఓ అమెరికన్ రైతు. రైతంటే మామూలు రైతు కాదు, చెట్ల ఎదుగుదలను కట్టడి చేస్తూ వాటిని విభిన్న ఆకృతులలోకి మలచగల శిల్పి. ఇతను కాలిఫోర్నియాలో ఒక ఉద్యానవనాన్ని స్థాపించాడు. ఇక ఇతని పనంతా అందులో చెట్లను పెంచడమే, కాకపోతే ఒక్కొక్క చెట్టును ఒక్కొక్క ఆకృతిలోకి మలచాలి. ఇలా మలచడానికి ఇతను పర్నింగ్(purning), గ్రాఫ్టింగ్(grafting) పద్దతులను ఉపయోగించేవాడు.తరువాత తరువాత ఇది ఒక సందర్శనాలయంగా మారింది. తరువాత దీనికి "The Tree Circus" అనే పేరు కూడా వచ్చింది.
ఇది Basket Tree గా ప్రసిద్ధిపొందింది.
తరువాత 1963లో $12,000కు ల్యారీ,పెగ్గీ థాంసన్ లకు విక్రయించాడు. అటు తరువాత ఇది పలువురి చేతులు మారుతూ, రకరకాల పేర్లు మారుతూ వచ్చింది. ఆఖరుగా మైఖేల్ బోన్ఫాంటే వీటిని తన నర్సరీలోకి తరలించి దానికి బోన్ఫాంటే గార్డెన్స్ (Bonfonte Gardens)గా నామకరణం చేశాడు. ఇప్పుడు ఇవి గిల్రాయ్ గార్డెన్స్(Gilroy Gardens) గా పిలవబడుతున్నాయి ఈ మహా వృక్షాల మహా శిల్పి Axel Erlandson.
దీనిపై మరింత సమాచారం కొరకు ఈ క్రింది లంకెలను ఆశ్రయించండి.
http://en.wikipedia.org/wiki/Axel_Erlandson
http://www.arborsmith.com/treecircus.html
http://www.mv-voice.com/morgue/2001/2001_08_03.hg3.html
http://romantictraveling.com/BonfanteGardens.htm