Type In English Convert to Telugu
13 గిగా పిక్సెల్స్ ఫోటో..
Wednesdayమనం ఇప్పటి వరకు, మెగా పిక్సెల్ ఫోటోలను మాత్రమే చూస్తున్నాం. అది కూడా మాహా అయితే ఒక 10 నుండి 15 మెగా పిక్సెల్స్ ఉంటుంది. ఐతే ఎప్పుడైనా గిగా పిక్సెల్ ఫోటోలను చూసారా?? అయితే ఒక సారి దీన్ని చూడండి.. ఈ సైట్‌లో కనిపించే ఫోటొ రెసొల్యూషన్ 13 గిగా పిక్సెల్లు. దీనిని కనుకా దాని అసలు రెసొల్యూషన్‌తోొ ప్రింట్ చేస్తే అది సుమారుగా పన్నెండువేల చదరపు మీటర్ల వైశాల్యం మీరకు ఉంటుంది. అంటే దీనిని పరిచి పెడితే సౌమారుగా 1.2 ఎకరాల స్థలం అవసరమవుతుంది. అయితే ఈ భారీ ఫోటోని కెమేరాతో ఒకే క్లిక్‌తో తీసారనుకుంటే పొరపాటే. దీన్ని కొన్ని వందల ఫోటోలను అనుసంధానం ద్వారా రూపొందించారు. ఇప్పటి వరకూ గిగా పిక్సెల్ సామర్థ్యంతో కెమేరాలు అందుబాటులో లేవు. ఇప్పుడిప్పుడే ఒక 4 గిగా పిక్సెల్ కెమేరా తయారు చేయడం కోసం రంగం సిద్దమవుతోంది. ఎంతో అద్భుతమైన ఈ కళాఖండాన్ని ఒకసారి మీరూ దర్శించండి. మరిన్ని గిగా పిక్సెల్ చిత్రాల కోసం ఈ సైట్లను వీక్షించండి.
http://haltadefinizione.deagostini.it/
http://www.gerardmaynard.org/
http://www.tawbaware.com/maxlyons/gigapixel.htm
"అంతా డిజిటల్ లోకం మాయ..."