Type In English Convert to Telugu
సి.డి, డి.వి.డి ల లో వికీపిడియా
Wednesdayవిశ్వ విజ్ఞాన సముదాయం వీకీ. మరి అలాంటి వీకీ ఇప్పుడు సీ.డీ, డి.వి.డీలపై దొరుకుతుంది! అదీ ఉచితంగా...కొన్ని స్వచ్ఛంద సంస్థల పుణ్యమా అని వీకీ సీ.డీ, డి.వి.డీలపై మనముందుకు వచ్చింది. ఈ దెబ్బతో మైక్రోసాఫ్ట్ ఎన్కార్టా(Microsoft Encarta), బ్రిటానికా ఎన్సైక్లోపీడియా(Britannica Encyclopedia) వంటి వాటికి చుక్కెదురైనట్లే. వారి వ్యాపారాలు దెబ్బతింటూండడం వల్ల ఇప్పటికే వారు వీకీపై దూషణలు(అదేనండి వీకీలో వ్యాసాలు తప్పులు తడకలంటూ...) మొదలు పెట్టారు.
వీకీను సీ.డీలపై ఆవిష్కరించడానికి వీకీమీడియా(Wikimedia) మరియు ఫ్రాన్సుకు చెందిన లింటర్ వెబ్(Linter Web) కలిసి కివిక్స్(Kiwix) అనే ఓపెన్ సోర్సు ప్రాజెక్టును మొదలుపెట్టాయి. దీనిని ఎవ్వరైనా ఉచితంగా దిగుమతి(Download) చేసుకోవచ్చు. ఇందులో వివిధ అంశాలకు చెందిన 2000 ఆంగ్ల వ్యాసాల వారకూ పొందుపరచి ఉంచారు. దీనీ పరిమాణం సుమారుగా 425M.B దాకా ఉంటుంది. ఇక ఇటివల SOS Childrens villages అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఇదే తరహాలో సీ.డీ, డి.వి.డీలపై వీకీని విడుదల చేసింది. వీరు ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా రెండింటిని విడుదల చేశారు. చిన్నది సీ.డీలను ఉద్దేశించి తయారు చేయబడింది. దీని పరిమాణం సుమారుగా 800M.B వరకూ ఉంటుంది. దీనిని నేరుగా వారి సైట్ నుంచి దిగుమతి చేసుకోవచ్చు . ఇకపోతే పెద్దదాంట్లో మరిన్ని వ్యాసాలు, మరింత వివరణాత్మకంగా ఉంటాయి. ఇది సుమారుగా 2.5G.B వరకూ ఉంటుంది. కాకపోతే దీనిని దిగుమతి చేసుకోవడానికి బిట్ టొరెంట్(Bit Torrent), అజూరస్(Azureus) లాంటి ఏదైనా టోరెంట్ క్లయింట్ కలిగి ఉండాలి. మరింకెందుకు ఆలస్యం పని మొదలు పెడితే పోలా...