Type In English Convert to Telugu
విండోస్ లో "☺ ☻ ♥ ♦ ♣ ♠ • ◘ ○" ఇలాంటివి సులభంగా రాయవచ్చు.
Wednesday↓ ♠ ♫ ☼ ► ◄ ♂ ♀ ♪ ఇలాంటి రకరకాల గుర్తులను విండోస్ లో సులభంగా రాయవచ్చు. అందుకు పెద్దగా కష్టపాడాల్సింది కూడా ఏమీ లేదు. ముందుగా ఏ Notepadనో, Wordpadనో, మరే ఇతర రాసుకునేందుకు ఉపయోగపడే సాధనాన్ని తెరవండి. ఇప్పుడు Alt ను నొక్కి ఉంచి 1 నొక్కండి. మీకు "☺" అనే సంజ్ఞ కనిపిస్తుంది. ఇదే విధంగా ఒకటి బదులుగా రెండు నొక్కితే "☻" అని కనిపిస్తుంది. ఇలా ఒకటి నుంచి 256 వరకు ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క రకమైన సంజ్ఞ వస్తుంది. ఇందులోనే మనం నిత్యం ఉపయోగించే ఆంగ్ల అక్షరాలు, అంకెలు, మరియు *&% మొదలైనటువంటి సంజ్ఞలు కూడా ఇమిడి ఉంటాయి. ఈ 256తో పాటుగా మరికొన్నింటిని కూడా రాయవచ్చు. ఉదాహరణకు Alt ను నొక్కి ఉంచి 0153 అని నొక్కండి. ™ అని కనిపిస్తుంది. కాకపోతే ఈ విధంగా 0ను ముందు కలిపితే మొత్తం 256 కూ రకరకాల సంజ్ఞలు రావు, కేవలం కొన్నింటికి మాత్రమే వస్తాయి. ఏ అంకెకు ఏ సంజ్ఞ వస్తుందో తెలుసుకునేందుకు పట్టికను చూడండి.
దీని గురించిన మరింత సమాచారమునకై ఈ క్రింది లంకెలను చూడండి:
http://en.wikipedia.org/wiki/Windows_Alt_keycodes
http://www.usefulshortcuts.com/alt-codes/index.php