Type In English Convert to Telugu
విండోస్ లో దాగున్న ప్రోగ్రాము
Wednesdayవిండోస్ లో దాగున్న ఒక కమాండ్ లైన్ ప్రోగ్రాము గురించి తెలిసింది. దీని ద్వారా మనమే మనకు కావలసిన రీతిలో ఒక .exe ఫైల్ ని చా సులభంగా తయారు చేసుకోవచ్చు.దీని పేరు "IExpress".
ముందుగా విండోస్ లోని రన్(Run) ప్రోగ్రాం తెరవండి. అందులో "iexpress" (అటూ, ఇటూ ఉన్న కోట్స్ కలపకుండా)అని టైపు చేయండి. ఆ తరువాత "IExpress Wizard" అనేది తెరుచుకుంటుంది. అందులో ఇచ్చిన ఆదేశాలను పాఠిస్తూ, మీరు నడపదలచిన ప్రోగ్రాములను వివరాలను అందులో ఇవ్వండి. ఆ తరువాత దానిని విండోస్ .exe ఫైల్ గా భద్రపరుస్తుంది. ఇప్పుడు ఆ .exe ఫైల్ ను నడిపిస్తే(Runచేస్తే) మీరు తయారు చేసిన ప్రోగ్రాములను, మీరిచ్చిన ఆదేశాల మేరకు నడుస్తాయి. ఇలా దీని ద్వారా ఒకదాని తరువాత మరొక ప్రోగ్రాములను మన ప్రమేయము లేకుండా నడపవచ్చు. అంతే కాదు దీని వల్ల ఒకటి కంటే ఎక్కువ మృదులాంత్రములను(softwares) జతచేర్చి, ఒకే మృదులాంత్రముగా(software) వాడుకోవచ్చు.
ఈ మాయదారి మైక్రోసాఫ్ట్ విండోస్ లో మరెన్ని మాయాజాలాలు దాగున్నాయో? మీకేమైనా తెలిస్తే క్రింద వ్యాఖ్యానించండి.