Type In English Convert to Telugu
9/11 తమాషా
Wednesday9/11 గురించి ఎవరికి మాత్రం తెలియదు. 2001లో సెప్టెంబర్ 11న అమెరికాలో జంట భవనాలు మరియు పెంటగాన్ పై పేలుళ్ళు జరిగాయి. ఉగ్రవాదుల దుశ్చర్య అని కొందరు, లేదు బుష్ ప్రభుత్వమే దీనిని కావాలని చెయించిందని కొందరు(సత్యాన్వేషులు Truth Movement) వాదిస్తూ ఉంటారు. సరే కాసేపు ఆ వాదనలను పక్కన పెట్టి ఆ సంఘటనకు ఉన్న ప్రత్యీకతలేమిటో ఒక సారి చూద్దాము...
పేలుళ్ళు జరిగిన తేదీ 9/11 అంటే 9+1+1=11.
సెప్టెంబరు 11, సంవత్సరంలో 254వ దినం.. అంటే 2+5+4=11.
సెప్టెంబరు 11 తరువాత సంవత్సరంలో 111 రోజులు మిగిలాయి.
ఆ భవంతులను డీకొన్న మొదటి విమానపు సంఖ్య 11.
ఆ రెండు భవంతులు 11 సంఖ్య ఆకారాన్ని పోలి ఉంటాయి.
న్యూయార్క్ అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో 11వ రాష్ట్రంగా చేరింది.
New York City లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
The Pentagon లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
Afghanisthan లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
George W Bush లో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి.
ఇక చివరగా కొసమెరుపేమిటంటే, అమెరికా అత్యవసర సేవలకు(Emergency Services) సంప్రదించాల్సిన సంఖ్య 911 (అయితే ఈ సేవలను 1968లో మొదటి సారిగా ప్రవేశ పెట్టారు).
మరో చిన్న మాట మీరు గమనించారో లేదో, ఈ 11 గురించి ఖచ్ఛితంగా 11 విశిష్టతలను వివరించాను.