Type In English Convert to Telugu
మాటల గారడి
Saturdayమాటల గారడి
-
రాజు కాని రాజు
-
తరాజు
-
-
కారము కాని కారము
-
ఉపకారం
-
-
రాగి కాని రాగి
-
బైరాగి
-
-
కోడి కాని కోడి
-
పకోడి
-
-
తారు కాని తారు
-
జలతారు
-
-
మామ కాని మామ
-
చందమామ
-
-
తాళి కాని తాళి
-
ఎగతాళి
-
-
దార కాని దార
-
పంచదార
-
-
నత్త కాని నత్త
-
మేనత్త
-
-
జనము కాని జనము
-
భోజనము
-
-
రాయి కాని రాయి
-
కిరాయి, పావురాయి
-
-
నాడ కాని నాడ
-
కాకినాడ
-
-
టూరు కాని టూరు
-
గుంటూరు
-
-
రెంటు కాని రెంటు
-
కరెంటు
-
-
మొగ్గ కాని మొగ్గ
-
పిల్లిమొగ్గ
-
-
కాయ కాని కాయ
-
తలకాయ, మెడకాయ
-
-
దేహము కాని దేహము
-
సందేహము
-
-
హారము కాని హారము
-
వ్యవహారము
-
-
శిక్ష కాని శిక్ష
-
బాలశిక్ష
-
-
దేశం కాని దేశం
-
సందేశం
-
-
తార కాని తార
-
సితార
-
-
దారము కాని దారము
-
మందారము
-
-
కీలు కాని కీలు
-
వకీలు
-
-
సందు కాని సందు
-
పసందు
-
-
కాలు కాని కాలు
-
టీకాలు
-
-
కారు కాని కారు
-
షికారు
-
-
పాలు కాని పాలు
-
కోపాలు, తాపాలు, మురిపాలు.
-
-
కులం కాని కులం
-
గురుకులం
-
-
జారు కాని జారు
-
బేజారు
-
-
గోళం కాని గోళం
-
గందరగోళం
-
-
పతి కాని పతి
-
తిరుపతి
-
-
రసం కాని రసం
-
నీరసం
-
-
కర్ర కాని కర్ర
-
జీలకర్ర
-
-
రాళ్ళు కాని రాళ్ళు
-
కీచురాళ్ళు
-
-
కట్టు కాని కట్టు
-
తాకట్టు
-
-
దారి కాని దారి
-
గోదారి
-
-
బడి కాని బడి
-
రాబడి
-
-
వరం కాని వరం
-
కలవరం
-
-
గ్రహం కాని గ్రహం
-
అనుగ్రహం
-
-
మందు కాని మందు
-
కామందు
-
-
కులం కాని కులం
-
గోకులం
-
-
గొడుగు కాని గొడుగు
-
పుట్ట గొడుగు
-
-
తాళం కాని తాళం
-
పాతాళం
-
-
మాట కాని మాట
-
టమాట
-
-
రాణి కాని రాణి
-
పారాణి
-
-
వెల కాని వెల
-
కోవెల
-
-
లత కాని లత
-
కలత
-
-
మత్తు కాని మత్తు
-
గమ్మత్తు
-
,తెలుగు పాఠాలు,తెలుగు నేర్చుకుందాం,అక్షరాలు
పదాల అంత్యాక్షరి
అమ్మ, మాట, టపాసు, సోగ్గాడు, డోలు, లంచం, మందారం, మామిడి, డబ్బు, బంతి, తరువాత, తేనె, నూనె, నేను, నువ్వు, వారు, రారు, రేపు, పోరు, రేచీకటి, టైరు, రంభ, బంగారం, మంచం, మల్లి, లక్ష్మి, మందిరం, మామ, మల్లె తీగ, గులాబి, బంతి పువ్వు, వేడి, డమరుకం, మనస్సు, సొగసు, సాగరం, మీగడ, డాబా, బాలు, లలిత, తీగా, గోడ, డప్పు, పంతం, మాయ, యమున, నింగి, గిలక, కలప, పలక, కడప, పడక, కప్ప, పాము, ముంగీస, సంబరం, మహిమ, మధురం, మనిషి, షికారు, రమ్యము, మందు, దువ్వెన, నౌకరు, రండి, డబ్బా, బంక, కైక, కోక, కేక, కవిత, తపన, నగరం, మరిది, దద్దరిల్లు, లాయరు, రబ్బరు, రంగు, గుడి, డజను, నందిని, నళిని, నీలం, మేషము, ముంగిట, టమాట, టక్కరి, రైలు, లక్క పిడత, తోలు, లవంగం, ముత్యం, మరల, లీల, లాల, లారి, రిక్షా, క్షేమం, మైలు, లత, తల, లేత, తమలపాకు, కుశలం, మైదా, దాదా, దేశం, ముంజ, జంతువు, ఉప్పెన, నైజం
బాగుంది కదూ... ఇంక చాలు, ధన్యవాదాలు.
చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు
చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు
క - ఈక, తోక, కోక, నూక.
గ - పాగ, లోగ, తీగ, పోగ, రాగ.
చం - లంచం, కంచం, మంచం.
జ - కూజ, పూజ, రోజ, నీరజ, కాజ.
ట - ఆట, పాట, మాట, బాట, కోట.
డ - జాడ, వాడ, గోడ, నీడ.
ణ - అన్వేషణ, రక్షణ, ఘర్షణ, నిరీక్షణ.
త - తాత, లేత, వాత, పాత, చెంత.
ద - గేద, పేద, బీద, సాద.
న - ఆన, కూన, వాన, లోన, పైన, నజరాన.
ప - కడప, కలప, చాప, చేప, గడప.
బ - అంబ, డాబ, కదంబ, గార్ధబ.
మ - తేమ, చేమ, మామ, చీమ, మడమ.
య - కాయ, లోయ, ఆయ, మాయ.
ర - అర, మర, కర, కాకర, మొర.
ల - కల, అల, కోకిల, వల.
వ - కోవ, నావ, బావ, చేవ, జావ.
శ - ఆశ, నిరాశ, దేశ, పేరాశ, దురాశ.
ష - ఉష, భాష, సంశ్లేష, సశేష, అశేష, విశేష.
స - నస, వస, బస, మానస, ముంగీస.
హ - ఊహ, నేహ, స్నేహ.
క్ష - కక్ష, లక్ష, బిక్ష, శిక్ష.
మూడు అక్షరాల పదాలు
మూడు అక్షరాల పదాలు
ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.
అరటి, అన్నము, అడవి, అతిధి, అందము, అంబరం
ఆకలి, ఆవడ, ఆకులు, ఆపద, ఆవిరి
ఇప్పుడు, ఇటుక,
ఈకలు
ఉడుత, ఉరుము
ఊర్వశి, ఊయల
ఋతువు
ఎలుక, ఎడమ, ఎందుకు
ఏనుగు, ఏడవ, ఏమని, ఏమిటి
ఐక్యత, ఐదవ
ఒకడు, ఒకరు, ఒంటరి
ఓటమి, ఓపిక
ఔరౌర
కలత, కలమ, కలసి, కవ్వము, కాగితం, కాటుక, కార్తీకం, కాలము, కుమ్మరి, కొంగ, కొల్లేటి, కోయిల
గడప, గడియ, గజ్జెలు, గుగ్గిలం, గుడిసె, గురువు, గులాబి
ఘనము, ఘోరము
చదరం, చక్రము, చక్కని, చక్రము. చదువు, చామంతి, చిక్కని, చిన్నది, చెల్లెలు
ఛత్రము, ఛురిక
జగము, జల్లిడ, జంట, జాబిల్లి, జగడం
ఝుమ్మని
టక్కరి, టపాసు
ఠీవీగా
డబ్బులు, డాబాలు, డజను
తలుపు, తలపు, తమ్ముడు, తాబేలు, తుఫాను, తుమ్మెద, తువ్వాయి, తెల్లని
దవడ, దండన, దిక్కులు, దువ్వెన, దుస్తులు
ధనము, ధనస్సు, ధరణి, ధరుడు, ధీరుడు
నగలు, నలక, నడుమ, నవ్వులు, నాట్యం, నిచ్చెన, నెమలి, నేస్తము
పలక, పండగ, పక్షులు, పగడం, పఠనం, పలక, పున్నమి, పువ్వులు, పెరట్లో, పొద్దున
ఫలము, ఫిర్యాదు, పింఛం
బజారు, బలపం, బచ్చలి, బియ్యము, బొమ్మలు
భజన, భద్రము, భటులు, భారతం, భీముడు, భుజం, భేదం, భోజనం, భవిత
మనిషి, మతము, మర్కటం, మిఠాయి, మిరియం, ముచ్చట, మువ్వల, మేఘాలు, మేదరి
యముడు, యఙ్ఞము
రచన, రసము, రక్తము, రవళి, రాగము, రమణ
లవంగం, లవణం
వలలు, వందనం, వాజ్మయం, విజ్ఞత, వియ్యము, వెనక, వెన్నెల
శతకం, శంఖము, శయనము
సత్రము, సహాయం, సందడి, సమయం, సూర్యుడు, సొగసు
హలము, హృదయం
క్షణము, క్షోభము, క్షారము
రెండు అక్షరాల పదాలు
రెండు అక్షరాల పదాలు
ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.
అమ్మ, అన్న, అక్క, అత్త, అన్న, అన్నం, అమ్మ, అయ్య, అర్ధం, అవ్వ
ఆట, ఆశ, ఆజ్ఞ, ఆస్థి
ఇల్లు, ఇది, ఇంట్లో, ఇంద్ర, ఇష్టం
ఈగ, ఈల,ఈనె, ఈక
ఉమ, ఉష, ఉప్పు, ఉష్ణం
ఊడ, ఊరు, ఊసు
ఎలా, ఎండ, ఎర్ర
ఏడు, ఏరు, ఏడ్చు, ఏక
ఐదు
ఒక, ఒంటె
ఓడ
ఔటు, ఔర
అంబ, అంకె, అంటు, అంతా
కల, కలం, కట్ట, కప్ప, కర్రి, కల్ల, కళ్ళు, కష్టం, కుండీ, కొమ్మ, కొయ్య,కోడి
ఖడ్గం, ఖ్తెదు, ఖైదీ
గంప, గద, గట్టు, గడ్డ, గడ్డి, గద్దె, గద్యం, గాలి, గుర్రం, గూడు, గొబ్బి, గొయ్యి, గొర్రె
ఘంట
ఙ్ఞానం, జ్ఞప్తి
చలి, చంక, చిన్న, చెక్క, చెట్టు, చెత్త, చెమ్మ, చెల్లి, చేను, చేప, చ్తెత్రం
జడ, జత, జున్ను, జొన్న, జ్ఞానం, జ్తెష్ఠం, జ్యోత్స్న
ఝరి, ఝషం
టన్ను, టక్కు
డబ్బా, డబ్బు,డాబా, డాడీ
ఢంకా
తల, తమ, తండా, తల్లి, తాళం, తీపి, తూర్పు, తోక
దండ, దండు, దణ్ణం, దూడ, దొంగ
ధూళి
నక్క, నగ, నిద్ర, నిప్పు, నీడ, నెల, నొప్పి
పని, పగ, పంట, పండు, పక్క, పక్షం, పత్తి, పద్యం, పప్పు, పళ్ళు, పాట, పార
ఫలం, ఫెళ్ళు
బంత, బడి, బద్ద, బస్సు, బావి, బిళ్ళ, బుర్రు, బువ్వ, బొమ్మ
భట్టు, భారం
మంచి, మర్రి, మన్ను, మబ్బు, మల్లె, మాఘం, మిస్సు,ముక్కు, ముత్యం, ముద్ద, మూల, మెట్టు, మేక
యతి
రమ, రవి, రంగు, రద్దీ, రాజు, రాణి, రాత్రి, రాష్ట్రం, రివ్వు, రుబ్బు, రోలు
లత, లక్ష, లడ్డు, లత, లేత
వల, వర, వక్క, వత్తి, వర్షం, వస్త్రం, వాన, వారం, వెన్న, వెర్రి, వేప
శంఖం, శశి, శక్తి, శివ, శుభ్రం
షష్ఠి
సత్య, సందు, సజ్జ, సుద్ద, స్నానం
హలం, హస్తి
క్షరం, క్షయ, క్షామం, క్షణం
అరుదుగా వచ్చే అక్షరాలు
అరుదుగా వచ్చే అక్షరాలు
తః, ఙ, ఞ
అంతఃపురం
ఉషఃకిరణాలు
వాఙ్మయం
యఙ్ఞం
ప్రాతఃకాలం
జ్ఞానం
పరిజ్ఞానం
దుఃఖం
ఆజ్ఞ
అజ్ఞాతం
తపఃఫలం
జ్ఞాపకం
సంశ్లేష అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలు
రాష్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )
ఈర్ష్య ( ర + ష + య = ర్ష్య )
కక్ష్య ( క్ష + య = క్ష్య )
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
అర్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )
ఉఛ్చ్వాస ( ఛ + చ + వ = ఛ్చ్వా )
జ్యోత్స్న ( త + స + న = త్స్న )
వస్త్రము (స + త + ర = స్త్ర)
ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)
స్త్రీ (సీ + తి + రి = స్త్రీ)
ఇన్స్పెక్టర్ (నె + స + ప = న్స్పె)
వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)
సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)
దారిద్ర్యము (ద + ర + య = ద్ర్య)
లక్ష్మయ్య (క + క్ష + మ = క్ష్మ)
కర్ఫ్యూ (రూ + ఫ + య = ర్ఫ్యూ)
రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)
ఉత్ప్రేక్ష (తే + ప + ర = త్ప్రే)
సంస్కృతి (స + క + ర = స్కృ)
సంయుక్త అక్షరాలు
సంయుక్త అక్షరాలు
ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు
తర్కము (ర + క = ర్క)
ఆసక్తి (కి + త = క్తి)
పద్యము (ద + య = ద్య)
అశ్వము (శ + వ = శ్వ)
కట్నము (ట + న = ట్న)
కాశ్మీరు (శీ + మ = శ్మీ)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
హర్షము (ర + ష = ర్ష )
పెండ్లి (డి + ల = డ్లి )
అగ్ని (గి + న = గ్ని)
అద్భుతము (దు + భ = ద్భు)
అభ్యాసము (భా + య = భ్యా)
అర్జున (రు + జ = ర్జు)
అవస్థ (స + థ = స్థ)
అష్టమి (ష + ట = ష్ట)
ఆర్యులు (రు + య = ర్యు)
ఇష్టము (ష + ట = ష్ట)
ఈశ్వర (శ +వ = శ్వ)
ఓర్పు (రు + ప = ర్పు)
కర్పూరము (రూ + ప = ర్పూ)
కల్గి (లి + గ = ల్గి)
కష్టము (ష + ట = ష్ట)
కార్యం (ర + య = ర్య)
కీర్తి (రి + త = ర్తి)
క్రమం (క + ర = క్ర)
గురు పత్ని (తి + న = త్ని)
చిత్రము (త + ర = త్ర)
జిహ్వ (హ + వ = హ్వ)
తెల్పు (లు + ప = ల్పు)
దర్జా (రా + జ = ర్జా)
దుర్గము (ర + గ = ర్గ)
ద్వాదశి (దా + వ = ద్వా)
ధర్మము (ర + మ = ర్మ)
నిశ్చలము (శ + చ = శ్చ)
నేత్రము (త + ర = త్ర)
పవిత్ర (త + ర = త్ర )
పార్వతి (ర + వ = ర్వ)
పుష్పము (ష + ప = ష్ప)
పొట్లకాయ (ట + ల = ట్ల)
ప్రవచనం (ప + ర = ప్ర)
ప్రాణం (పా + ర = ప్రా)
బ్రతుకు (బ + ర = బ్ర)
భక్తి (కి + త = క్తి)
మంత్రాలు (తా + ర = త్రా)
మర్కటము (ర + క = ర్క)
రాజ్యము (జ + య = జ్య)
రిక్త (క + త = క్త)
వర్షము (ర + ష = ర్ష)
విదర్భ (ర + భ = ర్భ)
విద్య (ద + య = ద్య)
విశ్వము (శ + వ = శ్వ)
వైష్ణవి (ష + ణ = ష్ణ)
శబ్దము (బ + ద = బ్ద)
సత్య (త+ య = త్య)
సద్గుణము (దు +గ = ద్గు)
సావిత్రి (తి + రి = త్రి)
స్థానము (సా + థ = స్థా)
స్నేహము (సే + న = స్నే)
స్వప్నము (ప + న = ప్న)
హస్తము (స + త = స్త)






