Type In English Convert to Telugu
విరామ చిహ్నాలు
Mondayవిరామ చిహ్నాలు
చదువుటకు, వ్రాయుటకు, విరామ చిహ్నాలు. మనము మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు చక్కగా అర్ధం కావడానికి వాక్యాల అంతంలో విరామాన్ని పాటించడం అవసరం. సులభంగా అన్వయించుకోవడానికి వాక్యాల్లో, వాక్యాంశాల్లో విరామాన్ని పాటించే స్థానంలో వాడబడే గుర్తుల్ని విరామ చిహ్నాలంటారు. వీటిని పాటిస్తే అన్వయక్లిష్టత ఉండదు. లేకుంటే విషయం అర్ధరహితం అవుతుంది. ఈ క్రింది విరామ చిహ్నాలు పరిశీలించండి.
, వాక్యాంశ బిందువు (కామ)
అన్వయంలో సమీప సంబంధాన్ని కలిగి విరామాన్ని పాటించే సందర్భాల్లో ఈ గుర్తును వాడతారు.
ఉదా: వెంకటేశ్వర్లు, రామకృష్ణ, శంకర్ కలసి ఒక కంపెనీలో పని చేస్తున్నారు.
; అర్ధబిందువు (సెమికోలన్)
మహా వాక్యాల్లోని ముఖ్య వాక్యాల చివరలో ఈ గుర్తు ఉంటుంది. ఒక విషయాన్ని నిర్దారణ చేసే సందర్భాలలో ఈ గుర్తును వాడుతుంటారు.
ఉదా: మానవుడు జీవించటానికి తింటాడు; కాని తినటానికి జీవించడు.
: న్యూన బిందువు (కోలన్)
మూడు మాత్రల కాలం విరతిని తెలిపేది. దూర సంబంధం గల రెండు ప్రత్యేక వాక్యాలకు మధ్య ఈ గుర్తు వస్తుంది.
ఉదా: దేశంలో నా కంటె గొప్పవాడు లేడనుకోకు : ఒకరిని మించిన మరొకరుండనే ఉంటారు.
. బిందువు లేక ముగింపు చుక్క (ఫుల్ల్ స్టాప్)
భిన్న వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది.
ఉదా: రాముడు మంచి బాలుడు.
అర్ధాన్ని బట్టి వచ్చే గుర్తులు
? ప్రశ్నార్ధక చిహ్నాం (ఇంటరాగేషన్)
ప్రశ్నార్ధక వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది.
ఉదా: ఎవరు మీరు?
! రాగ చిహ్నం (ఎక్సక్లమేషన్):
ఆశ్చర్యం, సంతాపం, ప్రశంస, సంభోధన మొదలైన వాటిని తెలిపే పదాల చివర, ఈ గుర్తు వస్తుంది.
ఉదా: ఆ! అయ్యో! అలా జరిగిందా!
" " అనువాద చిహ్నం (ఇన్వర్టెడ్ కామాస్):
ఇతర గ్రంధాల నుండి గ్రహింపబడిన వాక్యాలు, పదాలు మొదలైనవి వాటి కిరుప్రక్కల ఈ గుర్తులు వాడతారు.
ఉదా: "దుర్బలస్య బలంరాజా" అని వినవే.
( ) వృత్తార్ధం [ ] వలయితం (బ్రాకెట్స్):
ఈ రెండు గుర్తులు ముఖ్యమైన పదాలకు గాని వాక్యాలకు గాని రెండు ప్రక్కల ఉంచుతారు. ఒక విషయాన్ని విపులంగా తెలియజేయడానికి ఈ కుండలీకరణాలు ఉపయోగపడును.
ఉదా: దాశరధికి (రామునకు) నమస్కారం.
:- కోలన్ డేష్
అనగా చెప్పబడుచున్నది అనుటకు దీనిని ఉపయోగిస్తారు.
- ఈ గుర్తును డేష్ అందురు.
/ ఈ గుర్తును ఆబ్లిక్క్ లేదా శ్లాష్ అందురు.
* ఈ గుర్తును తారకం అందురు.
లింగములు
Saturdayలింగములు
లింగములు నాలుగు రకములు. అవి...
పుంలింగము
పురుషులను, వారి విశేషములను తెలుపును.
ఉదా: రాముడు, ధనవంతుడు, బాలుడు, అందగాడు, మొదలైనవి.
స్త్రీ లింగము
స్త్రీలను, వారి విశేషములను తెలుపును.
ఉదా: సీత, గుణవతి, ఆమె, అందగత్తె, మొదలైనవి.
నపుంసక లింగము
పశుపక్షులు, ప్రాణములేని వస్తువులు, వాని విశేషములను తెలుపును.
ఉదా: ఆవు, పూలు, చెట్లు, అది, అవి, మొదలైనవి.
సామాన్య లింగము
సమూహమును తెలుపును. స్త్రీ పురుషులకు భేదములేదు.
ఉదా: కొందరు, అందరు, ఎందరు, మొదలైనవి.
భాషాభాగములు
భాషాభాగములు
నామవాచకం: ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు.
ఉదా: రాముడు, గీత, శంకర్...
రాముడు మంచి బాలుడు.
పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం.
సర్వనామం: నామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు.
ఉదా: అతడు, ఆమె, అది, ఇది...
రాముడు మంచి బాలుడు. అతడు పెద్దల మాట వింటాడు.
ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు రాముడు అనే అర్ధం. అయితే రాముడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం.
విశేషణం: నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.
ఉదా: తెల్ల గోడ, చిన్న ఇల్లు, మంచి బాలుడు...
క్రియ: పనులను తెలుపు పదములను క్రియలందురు.
ఉదా: తినటం, తిరగటం, నవ్వటం...
అవ్యయము: లింగ, వచన, విభక్తి శూన్యములైన పదములను అవ్యయము లందురు.
అనగా స్త్రీ లింగము, పుంలింగము, నపుంసకలింగము వలన గాని, ఏకవచన, బహువచనముల వలన గాని, విభక్తుల వలనగాని ఏమార్పులను పొందని పదములను అవ్యయములని గుర్తించవలెను.
అవ్యవములు 2 రకములు
1. లాక్షణికములు
2. ప్రతి పదోక్తములు
లాక్షణికావ్యయములు
వ్యాకరణ కార్యముల వలన సాధింపబడిన అవ్యయములు లాక్షణికావ్యయములు.
ఉదా: చూచి - తిని, చూడక - తినక, చూచిన - తినిన...
ప్రతి పదోక్తావ్యయములు
పుట్టుకతోనే లింగవచన విభక్తులు లేనివియును, వాడుకలో అంగాదులను విడిచి వేరొక అర్ధములో ఉపయోగపడుచున్న శబ్దములను ప్రతి పదోక్తవ్యయములు అందురు.
ఉదా: కాని, అయినన్, కాబట్టి, కనుకన్, బాగు బాగు, నీకె, అయ్యో! అక్కటా!
విభక్తులు
విభక్తులు
దశరథుడు అయోధ్య నగరాన్ని పాలించిన సూర్యవంశపు రాజు. ఆయనకు ఒక దిగులు పుట్టింది. అతనికి సంతానము లేదు. చివరకి ఆయన పుత్రకామేష్ఠి యాగం చేయగా, ఆ యాగ ఫలం చేత, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు పుట్టారు. వారి యందు రాముడు పెద్దవాడు. సంతానం కొఱకు తపించిన దశరథుడు తన పిల్లలను చూసుకొని ఆనందించేవాడు. పుత్రుల వలన వంశం నిలుస్తుంది. పుత్రుని కలిగినవాడి కంటె అదృష్టవంతులు లేరు అని ఆ కాలంలో అనుకునేవారు.
పై వాక్యాలలో రంగు మారిన పదాలను గమనించండి. వాక్య నిర్మాణంలో వాటికెంతో ప్రాధాన్యత ఉంది. వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:
| ప్రత్యయాలు | విభక్తి పేరు |
| డు, ము, వు, లు | ప్రథమా విభక్తి |
| నిన్, నున్, లన్, గూర్చి, గురించి | ద్వితీయా విభక్తి |
| చేతన్, చేన్, తోడన్, తోన్ | తృతీయా విభక్తి |
| కొఱకున్ (కొరకు), కై | చతుర్ధీ విభక్తి |
| వలనన్, కంటెన్, పట్టి | పంచమీ విభక్తి |
| కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ | షష్ఠి విభక్తి |
| అందున్, నన్ | సప్తమీ విభక్తి |
| ఓ, ఓరీ, ఓయీ, ఓసీ | సంబోధనా ప్రథమా విభక్తి |