Type In English Convert to Telugu
మన ఆచార వ్యవహారాలు
Wednesdayమన ఆచార వ్యవహారాలు
ప్రపంచ సామాజిక చరిత్రలో భారతదేశానికున్న ప్రాముఖ్యత మరే ఇతర దేశానికీ లేదన్నది ప్రపంచ దేశాల ఉమ్మడి అభిప్రాయం. ఇందుకు కారణం ఇక్కడి ఆచార వ్యవహారాలే. ప్రతి దెశానికీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఐతే భారతదేశంతో పోలిస్తే ఆయా సంప్రదాయాలు ఒక్కో ప్రాంతాన్నిబట్టి మారుతూ ఉంటాయి.ముఖ్యంగా సాంఘిక వ్యవస్థలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాని భారతీయ సాంఘిక వ్యవస్థ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఇతర దేశాలకు ఓ సరికొత్త దిశను చూపుతున్నాయి.
భారతదేశంలో ఉన్నా, మరే ఇతర దేశంలో ఉన్నా స్వదేశీయుడైనా, విదేశీయుడైనా; చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరి నోటా వినిపించే ఏకైక మాట "ఇండియన్ కల్చర్". వేరే ఏ ఇతర దేశమైనా తమ దేశం పేరుపెట్టి ఉచ్చరించడానికి సంశయించే కల్చర్ అన్న పదానికున్న గౌరవం ఒక్క భారతదేశానికి మాత్రమే దక్కడం వెనక ఉన్న భారతీయ సంస్ర్కుతి, చరిత్ర యొక్క ఘనత తేటతెల్లమవుతున్నాయి.ప్రక్రుతితో మనకున్న బంధంకానీ, వివాహ మరియు కుటుంబ వ్యవస్థ పట్ల మనకున్న గౌరవం వల్లకానీ మన సంప్రదాయాలకో ఘనమైన కీర్తి దక్కింది. భారతదేశ ఆవిర్భావం నాటినుండీ ఒక ప్రత్యేక క్రమశిక్షణ కోసం కొన్ని రూపొందించబడితే మరికొన్ని సంప్రదాయాలు మనలో అంతర్భాగంగా వాటంతటకవే స్రుష్టించబడ్డాయి. స్రుష్టి గతానుక్రమంలో ఇదో అద్భుతమై ఖండాంతరాలలో మనకంటూ ఓ ప్రత్యేక వ్యవస్థను చాటాయి. ఇతర దేశాలకు మార్గదర్శకాలయ్యాయి. మన వేద విజ్ఞానాన్ని పాశ్చాత్యులు అనుసరిస్తున్నారు. యోగ నేర్చుకునేందుకు మన దేశానికే తరచూ వస్తునారు. భారతీయుల్ని సెంటిమెంటల్ ఫూల్స్ అని గేలి చేసినా ఆ సెంటిమెంటే మనలోని భాషాపరమైన, మతపరమైన భిన్నత్వాన్ని ఏకత్వంగా చూపిస్తుంది.మనల్ని ఏకతాటిపై నిలుపుతోంది. నవీన తరానికి నేటి ఆచార వ్యవహారాలు చాందసంగా అనిపించినా ఆ చాందసత్వమే వారి పాలిట వరమని కొన్నాళ్ళకి వాళ్ళే తెలుసుకునేలా చేస్తుంది.
ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి నిద్ర పోయేవరకు మనం ఎన్నో నియమ నిబంధనలను అనుసరిస్తుంటాం. సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తాం. సూర్య నమస్కారాలు చేస్తాం. ఇది మన ఆచార వ్యవహారాలలోని ఓ అంకమైనా దాని వెనుక ఓ గొప్ప సాధన యోగం ఉంది. అదే ఆరోగ్యానికి మూల కారణంగా నిలుస్తుంది. ఆ చిన్న రహస్యం తెలుసుకుంటే చాలు ప్రతి ఆచారం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఓ సంజీవనిగా మనకు బోధపడుతుంది. అలాగే ఇంటి ముందు ముగ్గులేయడం. మన పూర్వీకులు పెట్టిన ఈ సంప్రాదాయం శుభ మంగళానికి చిహ్నంగా కళ్ళకు కనబడుతున్నా, వీధిలోని బ్యాక్టీరియా ఇంటిలోకి రాకుండా నియంత్రించే ఒక ఔషధంగా ఇది ఉపయోగపడుతుంది.
కొన్ని ఆరోగ్యానికి సూత్రాలుగా నిలిస్తే, మరికొన్ని నడవడికకు మార్గదర్శిగా నిలుస్తాయి. అజ్ఞానాన్నీ, అహంకారాన్నీ కొన్ని తొలగిస్తే కొన్ని అరాచకం ప్రబలకుండా నియంత్రిస్తాయి. ఆరోగ్యం దేహానికి మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా ఎంత అవసరమో ఈ కట్టుబాట్లు తెలియజేస్తాయి. ఆరోగ్యకరమైన సమాజమంటే మిత్రభేదం లేని ఆహ్లాదకరమైన సమాజం. అశాంతులకి అవకాశమీయని నాగరిక సమాజం.అటువంటి సమాజం కావాలంటే కట్టుబాట్లనేవి ఇంటినుంచే ప్రారంభం కావాలి.
ఇంట్లో పాటించే అనేక కట్టుబాట్లు కట్టుదిట్టమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. మనం చేసే ఉపవాస దీక్షలు పరులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఏ విధంగా అంటే ఉపవాసం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. దానివల్ల మనిషిలో మానసిక ఎదుగుదల వస్తుంది. మానసికంగా పరిపూర్ణుడైన వ్యక్తి లో ఇరుగు పొరుగు అనే భావన కలుగుతుంది. తన అనే భేద భావం పోయి మన అనే ఆలోచన కలుగుతుంది. అది అతని పొరుగువారికి ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుంది. సమాజ నిర్మాణంలోపాలుపంచుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ప్రార్ధనా స్థలాలకు వెళ్ళడం, జాగరణలు చేయడం ఇవన్నీ మన సంస్ర్కుతిలో భాగాలు. వీటి వల్ల శాంతి ప్రవర్తన కలిగి, సౌభాగ్యం వెల్లివిరుస్తుంది.
ఈ సాంఘికాచారాలనే సంస్కారాలు అని కూడా అంటారు. వీటిలో కొన్ని ఆరోగ్యం కోసం చేసేవైతే, మరికొన్ని ఇంటిపై ఇతర చెడు ప్రభావాలు (దిష్టి) పడకూడదని చేసేవి. ఈ సంస్కారాల్లో ముఖ్యమైనవి పెళ్ళి, నామకరణము, అన్నప్రాశనము, పుట్టు వెంట్రుకలు తీయించుట, చెవులు కుట్టించుట, అక్షరాభ్యాసము, ఉపనయనం మొదలైనవి. స్త్రీలకు ప్రత్యేకంగా సీమంతము అనే ఆచారముంది. సీమంతమంటే గర్భిణి స్త్రీకి ఆరవ నెలలో చేసే శుభ సంస్కారం.
పెళ్ళిలో రెండు విధాలైన ఆచారాలు ఉంటాయి. అవి ఆర్యాచారాలు, దేశీయాచారాలు. పాణిగ్రహణము, సప్తపది ఆర్యాచారాలు. కాబట్టే వీటిని వైదిక మంత్రాల ద్వారా నిర్వహిస్తారు. మంగళసూత్రధారణ దేశీయాచారము. కాబట్టి దీన్ని మంత్రాలతో కాక శ్లోకాలతో నిర్వహిస్తారు. అనేక వేడుకల సంగమమే పెళ్ళి. కొత్త దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి పెద్దలు అనేక వేడుకలు చేస్తారు. పూల చెండ్లతో బంతులాట ఒకటి. తరువాత అయిరేని కుండలలో బంగారం, వెండి ఉంగరాలు వేసి దంపతులచే తీయించడం మరోటి. వీటన్నింటిలోనూ తలంబ్రాలు పోసుకొనుటలో ఎంతో వినోదం ఉంటుంది. ఇటివంటి ఆచారాలు ప్రాచీన కాలం నుంచీ వస్తూ మన నిత్య జీవితంలో అంతర్భాగాలైపోయాయి. ఐతే ఈ సాంఘికాచారాలు చాలావరకు స్త్రీలకు సంబంధించినవే ఉంటాయి. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. ఇంటి ఆడపిల్లను ఒక గ్రుహిణిగా తీర్చిదిద్దేందుకు చేసే పద్ధతులే ఈ ఆచారాలు. ఓర్పు, మితభాషిత్వం నేర్పేందుకు మౌనవ్రతము లేదా మూగ నోము అనే అచారము ఏర్పదింది. మూగనోము దీపావళి వెళ్ళిన మరునాటినుంచి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు పదిహేను రోజులపాటు చేస్తారు. ఇవికాక ఇంకా చిన్న చిన్న నోములు బాలికలకు అనేకం ఉంటాయి. శ్రావణ మాసంలో చేసె గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇంకా...అట్లతద్దె, నాగుల చవితి, బొమ్మల నోము మొదలైనవి. కొందరు మొక్క మొలిచిన కంద దుంపను తెచ్చి అలంకరించి పసుపు కుంకుమలతో పూజిస్తారు. దీనివల్ల కందపిలకలవలే సంతనాభివ్రుద్ధి జరుగుతుందని వీరి నమ్మకము.
అట్లతద్దె నాదు ప్రొద్దున్నే నిద్రలేచి, తలారా స్నానాలు చేసి, పెరుగన్నం తింటారు. ఆ తరువాత పెద్దలు అట్లు పోసి చుట్టుప్రక్కలవారికి పంచడం చేస్తుంటారు.అత్లతద్దె నాటి వేడుకలలో అత్యంత ముఖ్యమైనది ఊయలలు వేయడం. ఈ ఊయలలు ఇళ్ళలోనే కాకుండా ఊరంతా అనుకూలంగా ఉన్నచోటల్లా వేస్తారు. ముఖ్యంగా తాటి చెట్టు బోదెలతో వేసె అతి పెద్ద ఊయలలు ఊరంతా వినోదాన్ని నింపుతాయి. తెలంగాణ ప్రాంతంలో స్త్రీలు బతకమ్మ పండుగను ఎంతో ఘనంగా చేస్తారు. బతకమ్మను చెరువులో వాలారించి చల్దులు తిని ఇంటికొస్తారు. స్త్రీలు మిక్కిలి భక్తి శ్రద్ధలతో చేసే వ్రతం నాగులచవితి. పాము పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలు పోసి, మొక్కుకుంటారు. నాగెంద్రునికి వేది వస్తువులు పెట్టరు. ప్రధానంగా చలిమిడి పెదతారు. ఇదే కాకుండా గ్రామ దేవతను సంత్రుప్తిపరిచేందుకు బోనాలు పెడతారు. బోనము అంటే అన్నం వండి పెరుగు, స్వీటు చేసి, ఒక గిన్నెను పసుపు కుంకుమలతో అలంకరించి బోనమును దానిలో పెట్టి గ్రామ దేవతకు సమర్పించడం.
ఇవేకాక స్త్రీలు చేసె మరో చక్కని వ్రతము బొమ్మల నోము. దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక.
పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక. పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. పట్టణాల్లోకంటే గ్రామాల్లోనే పురుషుల వినోదాలు ఎక్కువ.
ఏదేమైనా పురాతనకాలం నాటి ఆచార వ్యవహారాలను వీడకుండా వాటిని చెక్కుచెదరకుండా ఆ వారసత్వాన్ని మన పెద్దలు మనకు అందిస్తూనే ఉన్నారు. వాటి మనుగడకోసం క్రమశిక్షణతో క్రుషి చేస్తున్నారు. తమ తమ వారసులకు వాటి ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. ఆ సంప్రదాయాలను కాపాడుకుంటూవస్తున్నారు. సంస్ర్కుతీ సంప్రదాయాల ద్వారా సమైక్యతను చాతుతున్న భారతదెశం ఇతర దేశాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా ముందంజలో ఉందని చెప్పవచ్చు. అందుకు ఆధారం ప్రపంచ దేశాలు మన సంస్ర్కుతి పట్ల ఆకర్షితులవడమే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఆ సమైక్యత వారసత్వంగా తరతరాలకూ అందుతూనే ఉంది.ఆ సంపదను కలసిమెలసి అనుభవించడం, ఆ ఆనందాన్ని నలుగురితోనూ పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది. ఆ ఆనందాలకు శాశ్వతత్వం చేకూర్చవలసిన బాధ్యత అందరి మీదా ఉంది.
పూర్తి వ్యాసం కొరకు