Your Ad Here

Type In English Convert to Telugu

అక్షయ తృతీయ

Wednesday

అక్షయ తృతీయ

ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి. అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి. అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం.

"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే

నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"

కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును. ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్నికృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు.

ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.

ఇందులకొక పురాణగాధకలదు. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్‌బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,

దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.

మూలం: పండుగలు పర్వదినాలు, ఆదిపూడి వేంకట శివ సాయిరామ్.







పూర్తి వ్యాసం కొరకు

0 comments:

Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...